Sunday, 3 April 2016

త్వరలో చిరు 150వ చిత్రం: నందా

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2007 'శంకర్‌ దాదా జిందాబాద్‌' తరువాత ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రామ్‌చరణ్‌ కథానాయకుడుగా ఇటీవల విడుదలైన 'బ్రూస్‌లీ' చిత్రంలో అతిథిగా కనిపించి అభిమానులు అలరించారు ఈ గ్యాంగ్‌లీడర్‌. తాజాగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కనుందని నటుడు నందా(ఆనంద శ్రీకృష్ణ) సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారని పోస్ట్‌ చేశారు.

http://dhunt.in/13Ib6?ss=gml
via Dailyhunt

No comments:

Post a Comment